అమరావతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తలూరు గ్రామం నందు గ్యాంబ్లింగ్ స్థావరంపై ఆకస్మిక దాడులు చేసి ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 13,450/- లను, 4 సెల్ఫోన్లను, 5 ద్విచక్ర వాహనాలను మరియు ఒక ఆటోను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసిన పల్నాడు జిల్లా పోలీసులు. అలానే జిల్లాలో నాటు సారా కాసే ప్రదేశాలపై అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో జరుపుతున్న ప్రత్యేక రైడ్లలో పట్టుబడిన వ్యక్తులను అరెస్టు చేసి, వారివద్ద ఉన్న నాటుసారా ఊటను ధ్వంసం చేయడం జరిగినది. జిల్లాలో ఎలాంటి అవినీతి కార్యకలాపాలు జరిగిన ఉపేక్షించేది లేదు అని ఈ సందర్భంగా పోలీస్ శాఖ తెలియచేసింది.