దేశంలో పెట్రోల్ ధరలు పెరగడం పై మొదటిసారి ప్రధాని మోడీ నోరు విప్పారు. ఆయన ఏమన్నారంటే.. “పెట్రోల్ ధరలు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వాలే కారణం. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గిస్తేనే పెట్రోల్ ధరలు తగ్గుతాయి. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా రాష్ట్రాలు వ్యాట్ తగ్గించడం లేదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తేనే పెట్రోల్ ధరలు తగ్గుతాయి. మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాలు వ్యాట్ తగ్గించడం లేదు. రాష్ట్రాలు తగ్గించనంత వరకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గవు.” అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.