మారుతున్న జీవనశైలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇటీవల చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలో ఎసిడిటీ ఒకటి. జీర్ణాశయంలో అవసరానికి మించి ఆమ్లాలు, రసాలూ విడుదల కావడంతో ఈ సమస్య వస్తుంది. ఎసిడిటీ కారణంగా ఆహారం తీసుకున్న తర్వాత కొందరిలో గుండెల్లో మంట, మరి కొందరికి నోట్లో పుల్లని నీళ్లు, మరి కొందరికి ఏదో తెలియని కడుపులో నొప్పి ఇబ్బంది పెడుతుంటుంది. అట్లాంటపుడు అనుకున్న పనులేవీ చేయలేక సతమతమవుతుంటారు. అయితే దీనికి చెక్ పెట్టేందుకు ఈ చిట్కాలను ట్రై చేయండి.
*చల్లటి పాలు తాగితే ఉపశమనం కలుగుతుంది. కడుపులోని యాసిడ్‌ను పీల్చుకుని మంటలు తగ్గిస్తాయి.
* యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా కలిగి ఉండటం చేత పుచ్చకాయలు రోజూ తీసుకుంటే శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. ఫలితంగా ఎసిడిటీ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
*ఈ సమస్యకు అరటి పళ్ళు కూడా మంచి పరిష్కారం చూపుతాయి. వీటిలో పీచు పదార్థాలు అధికం. వేసవిలో మిగల పండిన అరటి పళ్లు తిన్నా ఈ సమస్య నుండి ఉమశమనం పొందవచ్చు.