అమరావతి : తహశీల్దార్ బదిలీ తో కార్యాలయం ఎదుట బాణసంచా కాల్పులు.కోనసీమ జిల్లా, అమలాపురం మండల తహశీల్దార్ ఠాగూర్ బదిలీతో కార్యాలయం ఎదుట బాణాసంచా కాల్పులు.. సంబరాలు. అమలాపురం మండల తహశీల్దార్ గా ఉన్న ఠాగూర్ పి గన్నవరం తాసిల్దార్ గా బదిలీ.ఠాగూర్ వ్యవహార శైలితో విసిగి పోయిన మండలంలోని ప్రజలు.ఠాగూర్ బదిలీ కావడంతో అర్ధ రాత్రి కార్యాలయం ఎదుట బాణా సంచా కాల్చిన కొందరు వ్యక్తులు.ఠాగూర్ బదిలీ అవ్వడంతో కొందరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున బాణా సంచా కాల్పులు జరిపిన వైనం. తహశీల్దార్ బదిలీ కావడం తో మండల ప్రజలకు విముక్తి కలిగింది అంటూ పలుచోట్ల స్వీట్స్ పంచిన ప్రజలు.ఏ పని కావాలని వెళ్ళిన తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవరని ఆవేదన.ఎవరైనా అధికారి బదిలీ అయితే బాధపడతారు కానీ అమలాపురం తహశీల్దార్ బదిలీ అయితే సంబరాలు చేసుకున్న మండలంలోని ప్రజలు.