ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంసారానికి పనికిరాని భర్తతో జీవించలేనంటున్న భార్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 27, 2022, 02:24 PM

అందరిలాగానే ఆ యువతి పెళ్లి, భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కనింది. పెద్దలు చూసిన యువకుడితో తాళి కట్టించుకుంది. తీరా పెళ్లయ్యాక భర్త సంసారానికి పనికి రాడనే విషయం తెలుసుకుని అవాక్కయింది. తన జీవితం నాశనం చేశారంటూ కృష్ణా నది మధ్యలో దీక్షకు కూర్చుంది. సంచలనం రేకెత్తించిన ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన కొంగర నవ్యతకు కొంగర నరేంద్రనాథ్ అనే వ్యక్తితో నాలుగేళ్ల క్రితం పెద్దలు వివాహం జరిపించారు. ఆ సమయంలో వరుడికి భారీగా కట్నకానుకలు అందజేశారు. అయితే ఫస్ట్ నైట్ నుంచే నవ్యతను భర్త దూరం పెడుతూ వచ్చాడు. పెళ్లైన కొత్త కాబట్టి కొన్నాళ్లకు సర్దుకుంటుందని ఆమె అనుకుంది. అయితే నెలలు గడుస్తున్నా అదే తీరుతో ఉండేవాడు. దీనిపై ప్రశ్నించిన బాధితురాలిని భర్త, అతని కుటుంబ సభ్యులు కొట్టేవారు. అవన్నీ భరించిన బాధితురాలు కొన్నాళ్లకు తన భర్త నపుంసకుడనే విషయం తెలిసింది. దీంతో ఆమె కృష్ణా నదిలో సోమవారం నిరసన దీక్ష చేపట్టింది. పోలీసులు స్పందించి, తనకు న్యాయం చేయాలని కోరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com