తనకు పరిచయమైన యువకుడితో ఓ యువతి ప్రేమలో పడింది. అతడితో జీవితాన్ని ఊహించుకుంటూ కలలు కనింది. అయితే పెళ్లికి ముందే సంబంధం పెట్టుకోవాలని ఆమె ప్రియుడు ఒత్తిడి తీసుకొచ్చాడు. దీనికి నిరాకరించిన ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం వేధింపులకు దిగాడు. దీంతో ఆ వ్యక్తిపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరం సుభాష్ నగర్‌లో 20 ఏళ్ల యువతికి ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆమె తండ్రికి ఉన్న దుకాణంలోనే సదరు యువకుడు పని చేస్తుంటాడు. అయితే వారి మధ్య పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. 2021లో యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడు అక్కడికి వచ్చాడు. పెళ్లికి ముందు సంబంధం పెట్టుకోవాలన్న అతడి ప్రతిపాదనను ఆమె తిరస్కరించింది. ఆమె ఇష్టం లేదని చెబుతున్నా, యువతిపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత మరోసారి ఏకాంత ప్రదేశానికి పిలిచి లైంగిక దాడి చేశాడు. అతడి చర్యల పట్ల విసిగిపోయిన బాధిత యువతి శనివారం ఐష్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.