కొండమోడు- పేరిచర్ల జాతీయ రహదారి అభివృద్ధికి రూ. 600, కోట్లు ఓడరేవు -చిలకలూరిపేట వరకు 430 కోట్లు, చిలకలూరిపేట-నకరికల్లు వరకు రూ. 450 కోట్లు మంజూరు కావడం జాతీయ రహదారుల అభివృద్ధికి సూచిక అని ఎంపీ. శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. దాచేపల్లి -మాచర్ల రహదారి జాతీయ రహదారి గా గుర్తింపు సాధించినట్లు పేర్కొన్నారు. రొంపిచర్ల, మాచర్లలో కేంద్ర విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.