వాకాడు మండల కేంద్రం లోని అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద షాకీరమ్మ, మక్భుల్ అను తల్లీ కూతుర్లు అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు గుర్తించి మృతదేహాలను క్రిందకు దించి పోలీసులకు సమాచారం అందించారు. షాకీరమ్మ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.