నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం రాపూరు మండలంలోని కండలేరు జలాశయానికి వచ్చే నీటి ప్రవహం పూర్తిగా ఆగిపోయింది. అయితే గురువారం ఉదయం 6. 00 గంటల సమయానికి కండలేరులో 79. 080 మీటర్ల నీటి మట్టానికి 42. 528 టీఎంసీల నీరు నిల్వ ఉన్నదని కండలేరు ఏ ఈ కె. తిరుపాలయ్య ఓ ప్రకటనలో తెలిపారు. కాగా కండలేరు హెడ్ రెగ్యలేటర్ 50, సత్యసాయి గంగ కాలువకు 40, పిన్నేరు వాగుకు 00, మొదటి బ్రాంచ్ కెనాల్ 10, లోలెవల్ స్లూయిస్కు 50, హై లెవల్ స్లూయిస్ కు 00 క్యూసెక్కుల సాగు నీరు విడుదలవుతోందని కండలేరు డ్యాం ఏ ఈ కె. తిరుమలయ్య తెలియజేసినారు.