ఆసియాలోనే అత్యంత బలమైన రాజవంశంగా పేరొందిన గొటబాయ రాజపక్స కుటుంబం శ్రీలంకను 30నెలల్లోనే దివాళా తీయించింది. నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజల పరిస్థితి దుర్బరంగా మారింది. ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పర్యాటకం నుంచి వచ్చే ఆదాయం పడిపోయింది. విదేశీ అప్పులు తడిసిమోపుడయ్యాయి. ప్రస్తుత పరిస్థితులకు కారణమైన రాజపక్స ప్రభుత్వం గద్దె దిగాలంటూ పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.