రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే జైలుకు వెళ్తారని అగ్రి జేడీ నున్నా వెంకటేశ్వర్లు హెచ్చరించారు. గుంటూరు మండల కార్యాలయం కృషి భవన్ లో గురువారం విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు. నున్నా మాట్లాడుతూ. జిల్లాలలో ప్రతిఏటా నకిలీ విత్తనాల కారణంగా రైతులు భారీగా నష్టపోతున్నట్లు పేర్కొన్నారు. నకిలీ విత్తనాలతో వ్యాపారులకు వచ్చే లాభం కంటే అనేక రెట్లు రైతులు నష్టపోతున్నట్టు జేడీ నున్నాతెలిపారు.