గుంటూరు జిల్లా దుగ్గిరాలలో మహిళా హత్య సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ అక్కడికి చేరుకున్నారు. ఐతే ఈ హత్యకి కారకుడు టీడీపీ కార్య కర్త ఐనటువంటి సాయి చరణ్ చౌదరి అని స్థానికులు వెల్లడి చేసారు. ఏది తెలియని లోకేష్ అక్కడికి వెళ్లగా ప్రజలు కొంతమంది ఆగ్రహం వ్యక్త పరిచారు. వీరిలో వైసీపీ కార్యకర్తలు చేరి లోకేష్ మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ...నారా లోకేష్‌ని అంతమొందించేందుకు తుమ్మపూడిని వేదికగా చేసుకుంది జగన్ రెడ్డి గ్యాంగ్. నారా లోకేష్ పైకి పెద్ద పెద్ద రాళ్లు విసురుతోన్న ఈ వ్యక్తి పేరు దాసరి వీరయ్య. వైసీపీ దుగ్గిరాల జెడ్పీటీసీ భర్త. విజయవాడ మాచవరంలో సుబ్రమణ్యం హత్య కేసులో కీలక నిందితుడు. దీని కోసం నరహంతకులని రంగంలోకి దింపారని ఈ ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. అని కొన్ని ఫొటోస్ ని జతపరిచారు .