ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. విద్యార్థుల కోసం విద్యా దీవెన, వసతి దీవెన అమలు చేస్తున్నట్లు చెప్పారు. 'ఉద్యోగాలు కల్పించే దిశగా కోర్సులు ఉండాలి. జీఆర్ఈ, జీమ్యాట్ పరీక్షలపై మంచి శిక్షణ ఇవ్వాలి. దేశంలో డిగ్రీ చదవాలనుకుంటే ఏపీకి రావాలనిపించాలి. ఏపీలో డిగ్రీలు చదివితే మంచి జీతాలు వచ్చే పరిస్థితికి తీసుకురావాలి. టీచింగ్ ఫ్యాకల్టీలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి' అని జగన్ చెప్పారు.