అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం మండలం, చిలక మామిడి గ్రామస్థుల తాగునీటి అవస్థలు చూస్తే బాధేస్తోంది అని టీడీపీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తపరిచారు. ఇక్కడ పరిస్థితులను గమనించిన ఆయన మాట్లాడుతూ... సుమారు 150 గిరిజన కుటుంబాలు నివాసముండే ఈ గ్రామంలోని వాటర్ ట్యాంక్ మోటార్లు పాడయ్యాయి. రిపేరు చేయడానికి పంచాయితీలకు నిధులు లేకుండా చేసారు. సొంత డబ్బులు ఖర్చుపెట్టి పనులు చేయిస్తే ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. చేసేది లేక ఆదివాసీ ప్రజలు కొండ వాగు చెంత చెలమ నీటినే తాగుతున్నారు. ఇలా అయితే వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి? ప్రజలకు సురక్షిత తాగునీటిని ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం దీనికి ఏమి సమాధానం చెపుతుంది? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.