జి.కొత్తపల్లి గ్రామం, ద్వారకా తిరుమల మండలంలో ఈ రోజు ఉదయం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రామంలో గ్రామా నాయకుడు, ప్రసిడెంట్ గా బాథ్యతలు చేస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురికాగా, పరామర్శకు వెళ్లిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్‌పై ప్రత్యర్థి వర్గం దాడికి ప్రయత్నించింది. జి. కొత్తపల్లి గ్రామ ప్రెసిడెంట్ గంజి ప్రసాద్‌పై కొందరు దుండగులు కత్తితో దాడి చేసి హత్య చేశారు. అనంతరం సంఘటనా స్థలానికి గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్ చేరుకోగా, ఈ హత్య ఘటనకు ఎమ్మెల్యే కారణం అని ఎమ్మెల్యే పై దాడి చేసిన గ్రామస్తులు, గాయపడ్డ ఎమ్మెల్యే. ఈ క్రమంలో ఎమ్మెల్యేను రక్షించేందుకు ప్రయత్నించిన పోలీసులపైన రాళ్లు రువ్వినట్లు తెలుస్తోంది. దీంతో పోలీస్ వారు చాకచెక్కముగా ఎమ్మెల్యేను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈ హత్యకు కారణం వ్యక్తిగత కారణాలా? ఆస్తి వివాదాలా? లేదంటే రాజకీయ వైరంతోనే గంజి ప్రసాద్‌ను హత్య చేశారా? అనే కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa