ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రూపొందించిన దిశ చట్టం స్ఫూర్తితో రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణకు ఉరి శిక్ష పడిందని మంత్రి ఆర్కే రోజా తెలిపారు. బీ టెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడు శశికృష్ణకు ఉరి శిక్ష ఖరారు చేయడాన్ని మంత్రి స్వాగతించారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ఉరి శిక్ష ఖరారు చేసిన గుంటూరు కోర్టు న్యాయవాదికి ఆమె మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. దిశ చట్టం స్ఫూర్తితో హత్య జరిగిన 10 గంటల్లోనే నిందితుడిని పట్టుకోవడం, ఐదు రోజుల్లోనే చార్జ్‌షిట్ వేసి త్వరితగతిన విచారణ జరిగేలా దిశ ప్రత్యేక న్యాయవాదితో కేసు విచారణ చేపట్టి 8 నెలల్లోనే నిందితుడికి ఉరి శిక్ష వేయడం సీఎం వైయస్ జగన్ పరిపాలన గొప్పతనమని చెప్పారు.