ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై జరిగిన దాడి బాధాకరమన్నారు హోంమంత్రి తానేటి వనిత. ఎమ్మెల్యేపై జరిగిన దాడి వివరాలు తెలుసుకున్నామని తెలిపారు. ఇప్పటికే తాను జిల్లా ఎస్పీతో మాట్లాడానని.. దాడి ఎందుకు జరిగిందన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారని వెల్లడించారు. హత్యకు గురైన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు ఎమ్మెల్యేపై దాడి జరిగిందన్నారు.