ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టామని, ఈ నేపథ్యంలో 13 జిల్లాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని కేంద్రాన్ని ఏపీ సీఎం జగన్ కోరారు. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలుసుకుని, విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రిని కలుసుకుని తమ విజ్ఞప్తిని తెలియజేశారు.
కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలలో జిల్లాకు ఒకటి చొప్పున మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలన్నారు. వీరిద్దరి భేటీ 30 నిమిషాల పాటు కొనసాగింది. కొత్త జిల్లాలను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశామని, అక్కడి ప్రజలకు జిల్లా కేంద్రాలలో వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని జిల్లాల ప్రజలకు వారి జిల్లా కేంద్రాలలో మెరుగైన వైద్యాన్ని అందించేందుకు వైద్య కళాశాలల ఏర్పాటు ఆవశ్యకత ఉందన్నారు. సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.