ప్రేమ పేరుతో వంచించి 17 ఏళ్ల బాలికపై టీడీపీ నేత తోట నరేంద్ర(33) అత్యాచారం చేసిన ఘటన విశాఖలో జరిగింది. కొమ్మాది రాజీవ్ గృహకల్పలో నివసించే నరేంద్ర.. బాలికను ప్రేమ పేరుతో వేధించాడు. ఈనెల 12న తన పుట్టినరోజున అర్ధరాత్రి 12 గంటలకు విషెస్ చెప్పాలని బెదిరించాడు. దీంతో ఆ బాలిక అక్కడికి వెళ్లగా అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో నిందితున్ని అరెస్టు చేశారు.