ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్ జట్టు వరుస పరాజయాలతో నిస్తేజంగా మారింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా ఈ జట్టు తాజా సీజన్లో తొలి గెలుపు కోసం తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ సేన బౌలింగ్ ఎంచుకుంది. ఆ జట్టు ప్రత్యర్థి అయిన రాజస్థాన్ రాయల్స్ జట్టు తాజా సీజన్లో అద్భుతంగా రాణిస్తోంది. తక్కువ స్కోరును కాపాడుకోవడంతో పాటు భారీ లక్ష్యాలను ఛేదిస్తోంది. సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ జట్టు ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడి అందులో 6 మ్యాచ్‌లలో విజయాలు సాధించింది. అలాంటి జట్టుపై ముంబై ఆధిపత్యం చెలాయించి, తొలి విజయం నమోదు చేయాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు.
రాజస్థాన్ రాయల్స్ (తుది జట్టు): జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్(వికెట్ కీపర్ & కెప్టెన్), డారిల్ మిచెల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్
ముంబై ఇండియన్స్ (తుది జట్టు): ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), టిమ్ డేవిడ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, హృతిక్ షోకీన్, డేనియల్ సామ్స్, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, రిలే మెరెడిత్