ఈ నెల 27 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కాగా పలుచోట్ల ప్రశ్నాపత్రాలు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన అధికారులు..'కొందరు స్వార్థప్రయోజనాల కోసం ప్రశ్నాపత్రాన్ని ఫోటో తీసి.. వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. ఇలా చేయడం నేరం. వాట్సాప్‌కు వచ్చిన ఫోటోలు షేర్ చేసినా శిక్షార్హులు అవుతారు. వాట్సాప్‌లో ఎవరైనా ప్రశ్నాపత్రాలు పంపితే, పోలీసులకు ఫిర్యాదు చేయండి'అని సూచించారు.