సీఎం జగన్ కేబినెట్లో 10 మంది BCలకు అవకాశం కల్పించారని మంత్రి విడదల రజనీ చెప్పారు. గుంటూరులో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సత్కారం అనంతరం మాట్లాడిన ఆమె.. 'నా మంత్రి పదవి BCలకు దక్కిన గుర్తింపు. జగన్ ప్రభుత్వంలోనే BCలకు అనేక సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. BCలు, మహిళలకు పెద్ద పదవులు వైసీపీ తోనే సాధ్యం. BCలంతా జగన్‌కు మద్దతుగా నిలవాలి. ముదిరాజ్‌లను BC-D నుంచి BC-Aలో చేర్చాలని సీఎం ను కోరతాను' అని చెప్పారు.