చిత్తూరు: కుప్పం ద్రావిడ యూనివర్సిటీలో పిజి కోర్సులను కోనసాగించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వినతిపత్రాన్ని ఎమ్మెల్సీ భరత్ నేతృత్వంలో యూనివర్సిటీ పూర్వ విద్యార్ధులతో అందజేశారు. మంత్రి ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఉన్నత విద్యామండలి చైర్మనుతో మాట్లాడి వెంటనే యూనివర్సిటీలో పిజి అడ్మిషన్లు కొనసాగించాలని ఆదేశించినట్లు పూర్వ విద్యార్ధులు తెలియచేశారు. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసిన మంత్రి పెద్దిరెడ్డికి, ఎమ్మెల్సీ భరత్ కు పూర్వ విద్యార్ధులు కృతజ్ఞతలు తెలియచేశారు.