రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సచివాలయ వ్యవస్థని తీసుకురావడం జరిగింది. ప్రజలకి అందుబాటులో అన్ని రకాల సేవలు త్వరగా జరిగేలా చర్యలు చేపట్టారు. అలానే, పారదర్శకత చూపిస్తూ.. లంచాలకు, అవినీతికి తావు లేకుండా ఈ వ్యవస్థను తీసుకు వచ్చామని సీఎం జగన్ తెలియచేసారు. ఈ క్రమంలోనే, సచివాలయంలో మరి కొన్ని సేవలు అందించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుంది. పాస్ పోర్ట్ సేవలు కూడా ప్రారంభించాలని, అలానే ఫైలైట్ ప్రాజెక్టుగా 1600 సచివాలయాలలో ఈ సేవలు ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అలానే పాన్ కార్డు సేవలు, టికెట్ బుకింగ్ సేవలు కూడా చేయనున్నట్లు తెలియచేసారు. దీని వలన రాష్ట్రంలో ప్రజలకి, ముఖ్యంగా గ్రామాలలో ఉండే వారికీ పనులు సులభతరం అవ్వనున్నాయని తెలియపరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa