ఐపీఎల్-2022లో లీగ్ మ్యాచ్‌లు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి. మ్యాచ్ ఫలితాలు ఆఖరి ఓవర్ వరకు సాగుతూ ఉత్కంఠ రేపుతున్నాయి. తాజాగా సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. రాజస్థాన్ జట్టులో కెప్టెన్ సంజూ శాంసన్ 54 పరుగులతో రాణించాడు.
చివర్లో హెట్మెయిర్ మెరుపు వేగంతో 27 పరుగులు చేశాడు. మిగిలిన వారు రాణించకపోవడంతో ఆ జట్టు మోస్తరు స్కోరుకే పరిమితం అయింది. కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రాజస్థాన్‌ను కట్టడి చేశారు. ఆ జట్టు బౌలర్లలో టిమ్ సౌథీ 2, ఉమేష్ యాదవ్, అంకుల్ రాయ్, శివంమావి ఒక్కో వికెట్ తీసుకున్నారు.