మూడురోజుల యూరప్ పర్యటనలో భాగంగా జర్మనీ చేరుకున్న ప్రధాని మోదీ.. రాజధాని బెర్లిన్‌లో ఆ దేశ ఛాన్స్లర్ ఒలాఫ్ స్కోల్జ్‌తో భేటీ అయ్యారు. 6వ ఇండియా- జర్మనీ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్(ఐజీసీ)లో ఒలాఫ్ స్కోల్జ్‌తో కలిసి మోదీ పాల్గొన్నారు. వాణిజ్య ఒప్పందాలు, ద్వైపాక్షిక సంబంధాలపై ఇద్దరు నేతలూ చర్చించారు. మోదీతోపాటు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నారు.