ఢిల్లీ వాహనదారులకు ఆ రాష్ట్ర సర్కార్ షాక్ ఇచ్చింది. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని వాహనాలకు భారీగా జరిమానా విధించనుంది. దేశ రాజధానిలో పొల్యూషన్, ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. సరైన ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా వెహికిల్‌ను నడిపితే మొదటి తప్పుకు రూ.2,000-5,000, రెండవ, మూడవ తప్పుకు రూ.5,000-10,000 వరకు ఫైన్ విధించనున్నారు. ఫైన్ కట్టకపోతే జైలు శిక్ష విధించనున్నారు.