ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేఏ పాల్‌పై దాడి జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో వడ్లు కొనటానికి కేంద్రం మొగ్గు చూపకపోవడంతో ఎన్నో ధర్నాలు, రాస్తా రోకులు , తెరాస పార్టీ తరపున అలానే కాంగ్రెస్ పార్టీ తరపున బీజేపీ కి వ్యతిరేకంగా చేపట్టటం జరిగింది. ఐతే చివరికి తెరాస ప్రభుత్వమే ఈ వడ్లను కొంటాం అని సీఎం కెసిఆర్ నోటి గుండా తెలియచేసారు. ఐతే, ఈ ప్రక్రియ కొంత మేరకు ఆలస్యం కావడంతో రైతుల గోడు వినేందుకు , అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు సిరిసిల్ల జిల్లా వెళ్తున్న ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేఏ పాల్‌పై జిల్లెల్ల గ్రామానికి చెందిన అనిల్‌కుమార్ అనే టీఆర్‌ఎస్ కార్యకర్త దాడి చేశారు.