ముస్లిం ప్రజలకు రంజాన్ పండుగ ఒక బృహత్తరమైన వేడుకగా చెప్పుకోవచ్చు. దాదాపుగా నెల రోజుల పటు పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసాలు ఉంటూ దేవునికి ప్రార్ధనలు చేస్తుంటారు. ఎలా చెయ్యడం వలన వారి పాపాలు తొలిగిపోయి , వారిపై ఆ దేవుని ఆశీర్వాదం వస్తుంది అని వీరి నమ్మకం. ఈ రోజు రంజాన్ పండుగ జరుపుకుంటున్న ప్రతి ముస్లిం సోదరునికి సీఎం జగన్ ... సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు అని తెలియజేయడం జరిగింది.