అల్లుడిపై మామ కత్తితో దాడి చేసిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వాదే మహ్మదియాకాలనీకి చెందిన అబ్దుల్ బాబర్ , షెహనాజ్ బేగం భార్యభర్తలు కాగా. తాగుడుకు బానిసైన బాబర్ మద్యం మత్తులో భార్యను రోజూ వేధిస్తున్నాడు. దీంతో ఆమె పక్కనే అల్లుడు ముస్తాఫా ఇంటికి వెళ్లగా అతడు కూడా వచ్చి గొడవకు దిగాడు. ఇంట్లో ఉన్న అల్లుడి సోదరుడు ఖాజా బాబర్ ను కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.