పదవ తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. పరీక్షల నిర్వహణ లో లోపాలు ఉన్నట్టు తరచూ వస్తోన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అది విద్యార్థుల మానసిక పరిస్థితి పై తీవ్ర ప్రభావం చూపుతుంది. దాన్ని విద్యార్థులు జీవన్మరణ సమస్య గా భావించే అవకాశం కూడా ఉంది. గతంలో పకడ్బందీ అకడమిక్ ప్రణాళిక రూపొందించి అంతే నిబద్దత తో దాన్ని అమలు చేశాం. ఎక్కడా ఎలాంటి చిన్న అపోహ కు కూడా తావివ్వలేదు. అలా కాకుండా విద్యార్థుల్లో నమ్మకం కోల్పోయేలా పరిణామాలు సంభవిస్తుండడం దురదృష్టకరం అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు తెలిపారు.