ఇంకొల్లు మండలం ఇడుపులపాడు వద్ద రేషన్ బియ్యం పోలీసులకు బుధవారం రాత్రి పట్టుబడింది. ఒక మినీ లారీ పి. డి. ఎస్ రైస్ తో వెళ్తుందని విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఇంకొల్లు ఎస్ఐ ప్రసాద్ కాపు కాసి ఆ లారీని పట్టుకొని తనిఖీ చేయగా అందులో 80 బస్తాల రేషన్ బియ్యం ఉంది. ఎటువంటి బిల్లులు లేనందున ఎస్సై ఆ బియ్యాన్ని సీజ్ చేశారు. ఒక్కొక్క బస్తాలో 50 కేజీలు వంతున బియ్యం ఉన్నాయని ఎస్సై చెప్పారు. రైస్ అక్రమ రవాణా చేస్తున్న చీరాలకు చెందిన షేక్ అమీర్ తండ్రి జానీ ని అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa