న్యాయం కోసం వెళ్లిన ఓ బాలికపై పోలీస్ స్టేషన్ లోనే అత్యాచారం జరిగిన ఘటన యూపీలోని లలిత్‌పుర్ జిల్లా పాలీ పోలీసు స్టేషన్ లో జరిగింద. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. లలిత్‌పూర్ జిల్లాలోని పాళి పట్టణానికి చెందిన 13 ఏళ్ల బాలికను అదే ఊరికి చెందిన చందన్, రాజ్‌భాన్, హరిశంకర్, మహేంద్ర చౌరాసియా అనే నలుగురు యువకులు ఏప్రిల్ 22న మాయమాటలు చెప్పి భోపాల్ కు తీసుకెళ్లారు. భోపాల్ రైల్వేస్టేషన్ సమీపంలో ఆ బాలికపై ఉంచి మూడు రోజులపాటు అత్యాచారం చేశారు.
26వ తేదీన మళ్లీ ఆమెను పాళి పోలీస్ స్టేషన్ వద్ద వదిలేసి వెళ్లారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్లిన బాలిక నుంచి ఎస్‌హెచ్‌ఓ వాంగ్మూలం తీసుకున్నాడు. అనంతరం ఆ బాలికను తన అత్తతో పంపించేశారు. ఏప్రిల్ 27న వాంగ్మూలం నిమిత్తం బాధితురాలిని మళ్లీ స్టేషన్ కు పిలిపించారు. ఆ రోజు సాయంత్రం స్టేషన్ లోని ఓ గదిలో బాధిత బాలికపై ఎస్‌హెచ్‌ఓ అత్యాచారం చేశాడు. బాధితురాలిని కుటుంబ సభ్యులు ఏప్రిల్ 30న చైల్డ్ లైన్‌కు అప్పగించారు. అక్కడ బాలికకు కౌన్సెలింగ్ ఇవ్వగా జరిగిన దారుణమంతా చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులందరిపై కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ పోలీసులను ఆదేశించారు.
ఎస్పీ ఆదేశాల మేరకు చందన్, రాజ్‌భాన్, హరిశంకర్, మహేంద్ర చౌరాసియా, ఎస్‌హెచ్‌ఓతిలక్‌ధారి సరోజ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో బాలిక అత్తను కూడా నిందితురాలిగా చేర్చారు. ఎస్‌హెచ్‌ఓ తిలక్‌ధారి సరోజ్‌ను అరెస్టు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.