ఏపీ రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ అమరావతి రైతులు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే తీర్పును అమలు చేయట్లేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. నిధులు లేవనే సాకుతో రాజధాని తీర్పు అమలులో జాప్యం చేస్తున్నారని రైతుల తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం విచారణను జులై 12 కు వాయిదా వేసింది.