దేశ వ్యాప్తంగా రైతులకు మేలు చేకూరేలా పెట్టుబడి సాయం కింద కేంద్రం ప్రతి రైతుకు ఏటా రూ.6000 అందిస్తుండటం తెలిసిందే. ఏడాదికి మూడు విడతలుగా ఇప్పటి వరకు 10 ఇన్‌స్టాల్మెంట్లలో డబ్బులు రైతుల ఖాతాల్లోకి చేరగా, ప్రస్తుతం 11వ విడత డబ్బుల కోసం లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు. పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు మే నెల రెండో వారంలో అంటే మే 14 లేదా 15 తేదీల్లో రైతుల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సందర్భంగా రైతులు ఈ-కేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచించారు.