ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురువారం కీలక ప్రకటన చేశారు. బీహార్ లో అక్టోబర్ 2 నుంచి 3 వేల కిలో మీటర్ల పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇతర రాష్ట్రాల కంటే బీహార్ వెనుకబడి ఉందని ప్రశాంత్ కిషోర్ అన్నారు. లాలూ, నితీష్ పాలనలో చాలా వెనుకబడిపోయిందని, గత పాలన కొనసాగితే రాష్ట్రం అభివృద్ధి సాధించదని ప్రశాంత్ కిషోర్ అన్నారు. బీహార్ ప్రజల వద్దకు వెళ్లి కలుస్తానని, ప్రజల అభిప్రాయాలు కోరుతానని తెలిపారు. ప్రస్తుతం కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు.