జమ్మూకాశ్మీర్‌లో మతసామరస్యం వెల్లివిరిసింది. ట్రాల్‌లోని పాడిబల్ గ్రామంలో వాసిం అహ్మద్ అనే యువకుడు ఇతెకాఫ్‌ను పూర్తిచేసుకుని మసీదు నుంచి బయటకు రాగానే 80 ఏళ్ల సిక్కు పెద్ద కర్నైల్ సింగ్ తలపాగా చుట్టి, సన్మానించాడు. ఈ వీడియో ఆకట్టుకుంటోంది. ఇతెకాఫ్‌ను రంజాన్ మాసంలో నిర్వహిస్తారు. పదిరోజులు మసీదులోనే ఉండి, 5 పూటలా నమాజ్ చేయాలి. ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa