ఏపీలోని అన్ని స్కూళ్లకు శుక్రవారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. పదో తరగతి పరీక్షలు, విద్యార్థుల సమాధాన పత్రాల మూల్యాంకనం, ఇతర అకడమిక్ అంశాలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉన్నందున టీచర్లు యథావిధిగా స్కూళ్లకు హాజరు కావాల్సి ఉంటుంది. టీచర్ల హాజరుతో స్కూళ్లు ఈ నెల 20 వరకు కొనసాగనున్నాయి.
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉదయం 8 గంటల నుంచి 10.30 వరకు నిర్వహించాలని, పరీక్ష కేంద్రాలుగా ఉన్న స్కూళ్లను మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 వరకు నిర్వహించాలని కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ సూచించారు. వేసవి సెలవుల అనంతరం స్కూళ్లను జూలై 4న పునఃప్రారంభించనున్నారు.