తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కింపు నిర్వహించినట్లు ఈవో మునికృష్ణయ్య తెలిపారు. అమ్మవారికి భక్తులు హుండీ ద్వారా సమర్పించిన కానుకలు 36 రోజులకు రూ. 12, 99, 591 ఆదాయం వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ గోపి , బోర్డు సభ్యులు , దేవాదాయ శాఖ అధికారులు , బ్యాంకు సిబ్బంది , పోలీసులు పాల్గొన్నారు.