వ్యవసాయంపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా, రైతులకు పంట నష్టపరిహారం చెల్లింపు, సబ్సిడీపై రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ, ఖరీఫ్ సన్నద్ధత, కిసాన్ డ్రోన్లు, మిల్లెట్ పాలసీ, పంట మార్పిడి తదితర అంశాలపై సీఎం సమగ్రంగా వివరాలు తెలుసుకొని అధికారులకి దిశానిర్దేశం చేసారు. మే 16న రైతు భరోసా ఇవ్వనున్నట్లు అలానే జూన్ మొదటివారం ప్రాంతంలో రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వనున్నట్లు తెలియచేసారు. అదే నెలలో 3వేల ట్రాక్టర్లు సహా, 4014 వ్యవసాయ యంత్రాలు పంపిణీ . 402 హార్వెస్టర్లను కూడా కమ్యూనిటీ హైరింగ్‌సెంటర్లకు ఇస్తున్నట్లు తెలియచేసారు.