ఏపీలో శనివారం వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ మధ్య బంగాళాఖాతం, భూమధ్యరేఖ ప్రాంతంలోని హిందూ మహాసముద్రంలో అల్పపీడం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపానుగా మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రానున్న 24 గంటలల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నెల్లూరు, కడప జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ తుపాను హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.