మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి నాగ్‌పూర్ జిల్లాలోని విహిర్ గావ్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఘటనాస్థలంలోనే మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa