గుజరాత్ లో దారుణం చోటుచేసుకుంది. భార్య మీద అనుమానంతో ఓ భర్త హంతకుడు అయ్యాడు. పలుమార్లు తన భార్యను గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. పోలీసుల కథనం మేరకు..సూరత్ లోని దిండోలి ఏరియాలో సురుబా జలా-హన్సభా దంపతులు జీవిస్తున్నారు. సురుబా ఓ టైక్స్ టైల్ వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ దంపతులకు 19ఏళ్ల కొడుకు,16 ఏళ్ల కూతురు కూడా ఉన్నారు. గత మూడు నెలలకు ముందు తన భార్య ఫోన్ లో కొన్ని ఫోటోలు, మెస్సేజులు చూడటం వల్ల అతనికి భార్యపై అనుమానం ఎక్కువయ్యింది.
దీంతో కొంతకాలంగా తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందేమోనన్న అనుమానం పెంచుకున్నాడు. దీంతో పలుమార్లు భార్యను నిలదీయగా అలాంటిదేమీ లేదని హన్సభా తేల్చిచెప్పింది. అయినా తన భార్యపై అనుమానం ఎక్కువవుతూ వచ్చింది. దీంతో సురుబా తన కొడుకును అంగడికి పంపించాడు. అదే సమయంలో కూతురు కూడా స్నానం చేస్తుండటంతో భార్యను తీవ్రంగా పొడిచి పొడిచి హత్య చేశాడు. కొడుకు వచ్చే సరికి తల్లి హన్సభా చనిపోయి ఉంది. తండ్రి పరారీలో ఉన్నాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.