ఐపీఎల్-2022లో లీగ్ మ్యాచ్‌లు అత్యంత ఉత్కంఠతో సాగుతున్నాయి. అగ్రశ్రేణి జట్లు అంచనాలను అందుకోలేని పరిస్థితిలో కొత్త జట్లు అదరగొడుతున్నాయి. ఇక ఆదివారం రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య వాంఖడే స్టేడియంలో ఆసక్తికర పోరు జరగనుంది. డుప్లెసిస్ సారథ్యంలోని బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇటీవల ఆ జట్టు పుంజుకుని, ప్రత్యర్థులపై వరుస విజయాలతో ప్లే ఆఫ్‌కు చేరవవుతోంది. మరో వైపు కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని హైదరాబాద్ జట్టు వరుసగా 5 విజయాలు సాధించిన సంచలనం సృష్టించింది. అంతలోనే వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి పడిపోయింది. అయితే హైదరాబాద్ ఓడిన మ్యాచ్‌లలోనూ అద్భుత ప్రదర్శన కనబర్చింది. దీంతో ఈ రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగనుంది.
సాయంత్రం 7.30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య డీవై పాటిల్ స్టేడియంలో మరో ఆసక్తికర పోరు సాగనుంది. వరుస పరాజయాల అనంతరం తిరిగి చెన్నై సారథ్య బాధ్యతలను ధోని స్వీకరించాడు. ఆ వెంటనే ఆ జట్టు మరో విజయం సాధించింది. దీంతో చెన్నై వరుస విజయాలు సాధించి ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు అత్యంత ప్రతిభావంతులున్నప్పటికీ రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు ప్రదర్శన ఆటుపోట్లకు గురవుతోంది. కీలక సమయాల్లో తడబడుతూ మ్యాచ్‌లను చేజార్చుకుంటోంది. ఆడిన 10 మ్యాచ్‌లలో 5 విజయాలు, 5 పరాజయాలతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ఆ జట్టులోని కీలక ఆటగాళ్లు రాణిస్తే విజయం సాధించడం కష్టసాధ్యమేమీ కాకపోవచ్చు. ప్లే ఆఫ్‌కు ఇతర జట్లతో ఢిల్లీకి గట్టి పోటీ ఉంది.