జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, పాఠశాలలు, జూనియర్ కళాశాలలు యూ డైస్ అప్‌లోడ్ నమోదు ప్రక్రియ సోమవారం ఉదయం 10గంటలకల్లా పూర్తి చేయాలని డీఈవో పురుషోత్తం అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి శనివారం మధ్యాహ్నం ఆయన విద్యాశాఖాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీబీఎస్‌ఈ పాఠశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా యూ డైస్ నమోదు చేయాలన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆదేశాలతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో యూ డైస్ నమోదు జరుగుతున్న తీరును చిత్తూరు డీవైఈవో విజయేంద్రరావు పరిశీలించారు. యూ డైస్ నమోదులో వేగం పెంచాలని జిల్లాలోని 31మండలాల ఎంఈవోలతో చరవాణిలో పలుసార్లు సమీక్షించారు.