మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం నిధులను దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఐఏఎస్ అధికారిణి.. ప్రస్తుతం మైనింగ్ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. 2007లో ఆమె డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నప్పుడు కోట్లాది రూపాయాల అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. నాలుగు రాష్ట్రాల్లో ఆమె సన్నిహితుల నివాసాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ మొత్తంలో నోట్లు బయటపడటంతో అంత మొత్తం చూసి అధికారులు షాకయ్యారు.
ఝార్ఖండ్‌లో గనుల కేటాయింపులపై ఆరోపణలు.నాలుగు రాష్ట్రాల్లో ఈడీ అధికారుల సోదాలు.15 ఏళ్ల కిందట కేసులో ఐఏఎస్ అధికారి. 15 ఏళ్ల కిందటి ఈ కేసులో కుంటి సెక్షన్ అధికారి, జూనియర్ ఇంజీనిర్ రామ్ బినోద్ ప్రసాద్ సిన్హాలను 2020లో అరెస్ట్ చేసి.. రూ.4 కోట్ల ఆస్తులను జప్తు చేశారు. ఝార్ఖండ్ విజిలెన్స్ బ్యూరో అతడిపై 16 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. పూజా సింఘాల్ పేరు బయటకు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. జార్ఖండ్, బిహార్, రాజస్థాన్, పశ్చిమ్ బెంగాల్, ముంబయిలలో సోదాలు చేపట్టారు