పల్నాడు జిల్లా, రొంపిచెర్ల మండలం, ఆలవల గ్రామము పార్టీ గొడవలు భగ్గుమంటున్నాయి. పాలక , ప్రతి పక్షాల కార్యకర్తలు ఇప్పటికే ఎలక్షన్ మూడ్ లోకి దిగినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే టిడిపి కార్యకర్త కాకాని ఏసురాజు పై దాడి వైసీపీ వారు దాడి చేసినట్లు తెలుస్తుంది. పనికి వెళ్తున్న ఏసురాజు పై రొంపిచర్ల వైసీపీ ఎంపీపీ గడ్డం వెంకట్రావు వర్గం దాడి చేసింది అని బాధితులు వాపోయారు. కళ్లల్లో కారం కొట్టి రాళ్లతో,రాడ్లతో ఎంపీపీ వర్గం దాడి చేసినట్లు తెలియచేసారు. ఏసురాజు పరిస్దితి విషమం గా ఉండటంతో నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి లో ఏసు రాజును పరామర్శించిన నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ.... నరసరావుపేట నియోజకవర్గంలో వైసిపి అరాచకాలు పెరిగిపోయాయి. పోలీసులు వైసిపి తోత్తులుగా పని చేస్తున్నారని మండిపాటు. రోంపిచర్ల ఎస్ఐ కావాలనే వైసిపి వారితో దాడి చేయించాడు. రాబోయే ఎన్నికలలో ఇలాంటి దుర్మార్గులను పక్కన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియచేసారు. అలానే, టీడీపీ ఎల్లప్పుడూ కార్యకర్తలకి అండగా నిలుస్తుంది, ఎవరు అధైర్య పడవలసిన అవసరం లేదు అని తెలియచేసారు.