స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. రూ.2 కోట్లు, అంతకుమించిన టర్మ్ డిపాజిట్ రేట్లను 40-90 బేసిస్ పాయింట్ల (0.4-0.9 శాతం) మేర పెంచినట్లు మంగళవారం ప్రకటించింది. మే 10 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. 7- 45 రోజుల్లో మెచ్యూరిటీ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటును 3 శాతం వద్దే ఉంచింది. 46-179 రోజుల డిపాజిట్లపై వడ్డీరేటును 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచింది. 180-240 రోజుల డిపాజిట్లపై 3.1 శాతం నుంచి 3.5 శాతానికి పెంచింది. 211 రోజుల నుంచి ఏడాదిలోపు డిపాజిట్లపై 3.3 శాతం నుంచి 45 బేసిస్ పాయింట్లు పెంచి 3.75 శాతానికి పెంచింది. 1-2 ఏళ్ల డిపాజిట్లపై 0.4 శాతం, 2-3 ఏళ్ల డిపాజిట్లపై 0.65 శాతం, 3-10 డిపాజిట్లపై 0.90 శాతం పెంచింది.
మరోవైపు రూ.100 కోట్లకు మించిన పొదుపు డిపాజిట్లపై వడ్డీరేటును జూన్ 1 నుంచి 20-65 బేసిస్ పాయింట్ల మేర పెంచబోతున్నట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
- రూ.50 లక్షల నుంచి రూ.100 కోట్ల వరకు డిపాజిట్లపై వడ్డీ రేటు 2.9%
- రూ.100-500 కోట్ల డిపాజిట్లపై 2.90 శాతం నుంచి 3.10 శాతానికి పెంపు
- రూ.500-1000 కోట్ల డిపాజిట్లపై 2.90 శాతం నుంచి 3.40 శాతానికి పెంపు
- రూ.1000 కోట్ల పైబడిన డిపాజిట్లపై 2.90 శాతం నుంచి 3.55 శాతానికి పెంపు
- రూ.50 లక్షల కంటే తక్కువ ఉన్న పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్లు తగ్గించి 2.75 శాతానికి పరిమితం చేయనుంది.