ప్రజలకి సేవ చేసే విషయంలో ముందంజలో ఉంటాము అని మరో సారి నిరూపించుకుంది జనసేన. రాష్ట్రంలో తుఫాన్ హెచ్చరికలతో , దాదాపుగా వరం రోజుల నుండి ఏదో ఒక చోట వర్షం పడుతూనే ఉంది. అసలే ఏపీ లో రోడ్లు బాగాలేవు అని ఎన్నో సార్లు నిరసనలు చేప్పట్టిన సంగతి తెలిసిందే. దేనిలో భాగంగా చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండల కేంద్రంలో R&B రహదారిపై పెద్ద పెద్ద గుంతలు పడి అనేకమంది వాహనదారులు ప్రమాదములకు గురౌతున్న వాటికి మరమ్మతులు చెయ్యకపోవడంపై స్పందించి జనసేన పార్టీ తరపున ఇంచార్జి PVSN రాజు ఆధ్వర్యంలో WBM మెటీరియల్ తో గుంతలు పూడ్చి రహదారిని బాగుచెయ్యడమయినది.