2019ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దాదాపు గా అమలు పరిచి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ లు కోరారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు లో వారు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ, కౌన్సిలర్ మారుతి రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.